

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా నీతి నిజాయితీ గల నాయకుడు ప్రజల కోసం తన నమ్ముకున్న వారి కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడి పని చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని నేటి రాజకీయాల్లో చూడలేమన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తో జ్యోతుల చంటిబాబు చర్చించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసిపి పార్టీని బలపరిచే విధంగా తన అనుభవాన్ని గిరిబాబుకు వివరించారు. గిరిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలపరిచే విధంగా కృషి చేస్తానని మీ అందరి ఆలోచనలతో నియోజకవర్గంలో మరింత ముందుకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గణేశుల రాంబాబు, దోమాల గంగాధర్, బండారు రాజా, ఇళ్ల అప్పారావు కాపు, కంచి లక్ష్మణ్ దొర తదితరులు పాల్గొన్నారు.