

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణం లో ఉన్నారు……….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి*గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసింది. *సూపర్ సిక్స్ లో లేని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 12:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహన మిత్ర పథకాన్నీ ప్రకటించిన నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి లు ఆటో డ్రైవర్లతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణం లో ఉన్నారని అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే వారికోసం ఇంకా చాలా చేయాలనిపిస్తుంది అని అన్నారు. చంద్రబాబు వాహన మిత్ర ను ప్రకటించడం ఎంతో సంతోషమని, ఫ్రీ బస్సు వచ్చాక ఆటో డ్రైవర్ల పై కొత్త గొప్ప ప్రభావం పడిందని దానికి స్పందించిన చంద్రబాబు వెంటనే వాహన మిత్రను ప్రకటించారని అన్నారు. ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ఆటో డ్రైవర్ను కాపాడటం రెండూ ప్రభుత్వం యొక్క బాధ్యతని తెలిపారు. నిధులు మెండుగా ఉండి సంక్షేమాలను చేయటం లేదని, గత వైసిపి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చి ఫైన్ల రూపాన తిరిగి 20,000 వసూలు చేసిందని అన్నారు. ఆటో డ్రైవర్లు ఆర్థికంగా బలపడాలని వారి బిడ్డలు ఉన్నత చదువులు చదవాలన్న ఆలోచనతో చంద్రబాబు వాహన మిత్ర తీసుకువచ్చారని అన్నారు. ఆటో డ్రైవర్ల అందరి తరపున చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ….. సూపర్ సిక్స్ లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో సూపర్ సిక్స్ ఎంతో మంది అవహేళన చేశారని గుర్తు చేశారు. ఇష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అనుభవంతో ఆదాయాన్ని ఎలా పెంచాలి ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఫైన్లు వేసే అయిన విషయాన్నీ కూడా ఆటో డ్రైవర్లకు తెలియకుండా పోలీస్ గ్రౌండ్ కు పిలిచి వేళల్లో ఫైన్ లు వేశారని, ఆ సమయంలో ఇంట్లో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి ఫైన్లు కట్టారని గుర్తు చేశారు. టిడిపి హయాంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛగా ఆటోలు నడుపుకుంటున్నారని వారి శ్రేయస్సు కోసం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ప్రకటించారని అన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్మి నెల్లూరు నగరంలో మొట్టమొదటిగా వందలాదిమంది ఆటో డ్రైవర్లు పార్టీలో చేరారని, ప్రజా శ్రేయస్సే టిడిపి చంద్రబాబు ధ్యేయమని అన్నారు. వారితో పాటు కువ్వరపు బాలాజీ, మైనుద్దిన్, జాఫర్ షరీఫ్, రేవతి తదితరులు పాల్గొన్నారు.

