

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తో పంతం కొండలరావు కొంతసేపు రాజకీయాలపై చర్చించారు. కొండలరావు మాట్లాడుతూ తన తండ్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ అనుభవాన్ని తీసుకుని నేటి రాజకీయాల్లో గిరిబాబు నడుచుకోవాలని సూచించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం లో ముద్రగడ పద్మనాభం చేసిన అభివృద్ధి నేటికీ ప్రజల్లో గుర్తుండిపోయేలా అభివృద్ధి పనులు చేసిన ఘనత ముద్రగడ పద్మనాభం కే దక్కుతుందన్నారు. గిరిబాబు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించి దీవించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి సత్యనారాయణ, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.