

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5 వ వార్డు పోలీస్ కాలనీ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా నాయకుడు , చిత్తూరు ఇంచార్జ్ విజయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని చిత్తూరు నగర పరిధిలోని 5,6 మరియు 7 వ డివిజన్లలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు , మహిళలకు పంచిపెట్టడం జరిగింది. అనంతరం తోబుట్టువులకు చీరల పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఏ అవసరమైన ముందుండి వారి కష్టాలను తీరుస్తారని.. అలాగే వైయస్సార్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తారని పలువురు కొన్నియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ,నగర అధ్యక్షులు కేపీ శ్రీధర్ , విజయసింహ రెడ్డి , జ్ఞానజగదీశ్ ,కృష్ణ రెడ్డి నారాయణ ,రసంపల్లి ప్రకాష్ ,మనోజ్ రెడ్డి ,అన్బు ,అను ,అప్పొజ్జి , భాగ్యలక్ష్మి ,వార్డు ఇంచార్జలు, వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, హరిణి రెడ్డి అభిమానులు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది.
