

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం కౌలు రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏలేశ్వరం మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు,జ్యోతుల పెదబాబు,జనసేన నాయకులు లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకోట మోహన్,నీటి సంఘం అధ్యక్షులు ఎస్.జీ.వి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏనుగు ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇందులో భాగంగా వారికి పంట సాగు హక్కు కౌలు పత్రాలు అందజేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కౌలు రైతులు అనేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహకాలు అందక కౌలుసాగు చేయలేక అనేక ఇబ్బందులు పడ్డారు.ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు గ్రామాల్లో రెవెన్యూ, వ్యవసాయశాఖ సంయుక్తంగా అర్హులను గుర్తించి వెంటనే హక్కు పత్రాలు అందజేశారు.ఈ కార్డులుంటే కౌలు రైతులు అన్నదాత సుఖీభవతో పాటు పలు ప్రభుత్వ ప్రయోజనాలు పొందొచ్చు అన్నారు.కౌలు రైతులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని,పీఎం ఫసలీ భీమా యోజన,కిసాన్ క్రెడిట్ కార్డులు ద్వారా రుణాలు వంటి పథకాలను కూడా పొందవచ్చని తెలిపారు. కార్యక్రమం లో యస్ సి సెల్ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు,సొసైటీ మాజీ చైర్మన్ చిక్కాల లక్ష్మణరావు,పొట్టపల్లి రమణ,వ్యవసాయశాఖ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు