బంగారుపాళ్యం, మన ధ్యాస , సెప్టెంబర్ 9 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కేజీ సత్రం నేషనల్ హైవే నందు ప్రతి నిత్యం వేలాది గా వాహనాలు ఇరువైపులా ప్రయాణిస్తుంటాయి. ఈ యొక్క నేషనల్ హైవే నుంచి ఒక వైపు తబుగానిపల్లె, మంగళపల్లె, వెంకటాపురం, జిల్లేడుపల్లె, కేజీ సత్రం, చీకూరుపల్లె గ్రామము లకు వెళ్లడానికి యూటర్న్ కలదు, అలాగే ఎద్దులవారిపల్లె, బోడబండ్ల కు వెళ్లడానికి ఇంకోవైపు గా కల్లూరుపల్లె, కాటప్పగారివల్లె, సాయంత్రం వేళ వాహనములు ప్రయాణించే సమయంలో వెలుతురు లేని కారణంగా ప్రతినిత్యం ఏదో ఒక సంఘటనలు జరుగుతూ ఉన్నాయని, ఈ సర్కిల్ నందు లైట్లు వేసి సుమారు 6 నెలలకు పైగా కావస్తున లైట్లు వెలగడం లేదని, ఈ లైట్ల ను అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేసి వెలిగించి అలాగే సర్కిల్ నందు సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఉదయం పొలాల వద్దకు వెళ్లి సాయంత్రం సమయంలో పశు వులతో గ్రామాని కి తిరిగి వెళ్లు రైతులకు, రోడ్డు నుంచి పరిసర గ్రామాలకు ప్రయాణించే వాహన దారులకు, జరుగు ప్రమాదాలను అరికట్టి, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిసర గ్రామ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.









