

13వ తేదీన జరుగు లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోండి
జూనియర్ సివిల్ జడ్జి
వి. లీలా శ్యాంసుందరి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) నకు రెగ్యులర్ ప్రాతిపదికన న్యాయమూర్తిగా గౌరవ వి.లీలా శ్యాంసుందరి బాధ్యత తీసుకున్న నేపథ్యంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇకమీదట రెగ్యులర్ గా సింగరాయకొండ కోర్టును నిర్వహిస్తారని, అదేవిధంగా ఈనెల 13వ తేదీన అనగా రెండవ శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన లోక్ ఆధాలాట్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా కేసులు త్వరితగతిన పరిష్కారం పొందేందుకు లోక్ ఆధాలాట్ మంచి వేదిక అని, దీని ద్వారా కేసులు పరిష్కారం కావడం వల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని తెలిపారు.సివిల్, క్రిమినల్, వ్యాజ్యేతర కేసులు, పెండింగ్‌లో ఉన్న వివాదాలు వంటి అనేక కేసులను కోర్టులో తీర్పుకు వెళ్లకుండా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కేసులు దీర్ఘకాలం కొనసాగకుండా త్వరగా ముగించడానికి ఇది మంచి అవకాశం అని, దీనిని అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేసారు.కార్యక్రమంలోసింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు,శ్రీనివాసులు,రాఘవేంద్ర,రియాజ్ పఠన్, వంశీ,తదితరులు పాల్గొన్నారు.