అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!

ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు..!

అమరావతి సెప్టెంబర్ 09 :మనద్యాస న్యూస్ :///

ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి అభన్న హస్తం అందిస్తున్నారు. అనేక సందర్భాలలో జరిగిన ప్రమాదాలను తెలుసుకొని నేరుగా వారిని కలుసుకొని శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎమ్మెల్యే కృషి చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో మూడవ రోజు నిమజ్జనం కార్యక్రమంలో బాణా సంచాలు పేలి 9 మంది చిన్నారులకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం కూడా అందించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగిన ప్రమాద విషయాన్ని వివరించడం జరిగింది. వెంటనే చలించి పోయిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క చిన్నారికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని కంటే, ఇకముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోరుకుంటుందని, సంఘటన విషయం తెలిపిన వెంటనే 9 మంది చిన్నారులకు 18 లక్షలు సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా చిన్నారుల కుటుంబాల నివాసాలకు వెళ్లి చిన్నారులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చిన సహాయాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. అదేవిధంగా ప్రముఖ వైద్యుడు రవి అవసరమైన చిన్నారులకు ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు కూడా ముందుకు వచ్చారని, అవసరమైన వారికి సర్జరీ చేయించేందుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని నియోజకవర్గ ప్రజలకు అధికారులకు, తెలియజేశారు.

  • Related Posts

    డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

    మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…

    ఉదయగిరి నియోజకవర్గం నుండి స్వచ్చందంగా పాల్గొన్న వేలాదిమంది అన్నదాత లు..అన్నదాత లకి యూరియా అన్దిన్చి తక్షణమే ఆదుకోవాలి…లేనిపక్షంలో అన్నదాత ల తరుపున పోరాటం ఉదృతం చేస్తాం…//

    ఉదయగిరి, కావలి,: (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి నాగరాజు:://// ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గం లో వైఎస్ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..