

ఉదయగిరి, కావలి,: (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి నాగరాజు::////
ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి,
ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అండగా కావలి లో ఆర్డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మద్దు నిద్రపోతుంది ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారులు దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షోభం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గాని వ్యవసాయ మంత్రి గా అచ్చం నాయుడు గాని ఏమాత్రం చీమకుట్టినట్టైనా లేదు అని అన్నారు . రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన అచ్చం నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగించేందుకు అర్హుడేనా? రైతుల ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తు రావడం దౌర్భాగ్యం. చేసిన తప్పిదాలకు లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కష్టాలు వారి పట్ల మానవత్వం చూపించాల్సింది పోయి..ఇంకా అవమానపరచడం దారుణం అన్నారు . రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్లో అధిక భాగం ప్రైవేటుకు మళ్ళించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అచ్చం నాయుడే స్వయంగా చెప్పాడు అన్నారు .సహజంగా రాష్ట్రాన్ని కేటాయించిన ఎరువులను 50 శాతం ప్రభుత్వము ఆధీనంలోని మార్క్ ఫెడ్ కు 50% ప్రైవేటుకు కేటాయిస్తారు. ఈ ఎరువులను మార్కెట్ యార్డుల ద్వారా పిఎసిఎస్ లు, ఏపీవోల ద్వారా పంపిణీ చేస్తారు . ప్రైవేటు కేటాయించిన ఎరువులను ప్రైవేటు దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తారు. పద్ధతి ప్రకారం ఇలా జరుగుతుంది. మరి అలా కాకుండా మార్క్ ఫెడ్ ఇవ్వాల్సిన 50% ఎరువులను తగ్గించి ప్రైవేటు కేటాయించడం అత్యంత దుర్మార్గం అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని గతంలో కన్నా ఎక్కువే ఇచ్చామని చెప్తున్నారు గతంలో కన్నా యూరియా సహా ఎరువులు ఇస్తే రైతులకు ఎందుకు దొరకడం లేదు అన్నారు. సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గినప్పుడు ఎరువుల లభ్యత ఎందుకు లేదు అన్నారు . ఈ విషయాలు చూస్తుంటే ఎరువులను బ్లాక్ తరలించి సొమ్ము చేసుకున్నారని సులభంగా అర్థం చేసుకోవచ్చు. సమస్య ప్రైవేటు వ్యక్తుల నుంచి వస్తుందని అనుకున్నప్పుడు వెంటనే ప్రభుత్వ విభాగమైన మార్క్ ఫెడ్ కు కేటాయింపులు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో పెట్టిన గ్రామ వార్డు సచివాలయాలు ఆర్బికేల సిబ్బంది ప్రతి గ్రామాలలోనూ ఉన్నారు కదా వారి సేవలను ఎందుకు వాడుకోలేదు. గతంలో మేము చేసినట్టుగా ఆర్బికేల ద్వారా ఎరువుల పంపిణీ ఎందుకు చేపట్టలేదు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బికేల వ్యవస్థను నాశనం చేశారు ఉచిత పంటల బీమాకు పాతర వేశారు.ఏ సీజన్లో పంట నష్టం వస్తే అదే సీజన్లో ముగిసే లోపు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ మరుసటి సీజన్ లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (నష్ట పరిహారం) ను అందించే పద్ధతిని ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు. రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు . యూరియా సహా ఎరువులను కొరత లేకుండా చూడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉదయగిరి నలుమూలల నుండి రైతులు, నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్సీపి అభిమానులు పాల్గొన్నారు.