

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో శనివారం విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం డాక్టర్ చింతా శ్రీకాంత్ నాయకత్వంలో జరిగింది.శిబిరం సందర్భంగా డాక్టర్ చింతా శ్రీకాంత్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. పిల్లల్లో దంత సంబంధిత సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.