తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతుసంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి పరిశీలించడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే , ఎస్పీ రిజర్వాయర్ లోకి బోటులో గాలించిన చేయడం జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ….గ్రామంలో తీవ్ర విషాద సంఘటన జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. గజఈత గాళ్లతో గాలింపు చేయించి తొందరగా రిజర్వాయర్ లో గల్లంతయిన వారిని గుర్తించాలని అధికారులకు, పోలీస్ అధికారులకు, సూచించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం నుండి అందించే వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఆర్థికంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకలు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అలాగే వారి పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే గారు భరోసాని ఇచ్చారు.అదేవిధంగా ఎమ్మెల్యే ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బాధితుల పిల్లలకు బాబుకు 5 లక్షలు, పాపకు 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాటికుంట గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, వై చంద్రశేఖర్ రెడ్డి , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!