భార్య భర్తలు గల్లంతు అయిన తాటికుంట రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.

గద్వాల జిల్లా మనధ్యాస సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులో గల రిజర్వాయర్లో దురదృష్టవశాత్తు గల్లంతైన భార్య భర్తలు బోయరాముడు, సంధ్య సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిజర్వాయర్ వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తాటికుంట గ్రామానికి చెందిన భార్య భర్తలు నిన్న సాయంత్రం సమయంలో చేపల వేటకు అని రిజర్వాయర్లోకి వెళ్లి రాత్రి అయిన తిరిగి ఇంటికి, పొలం దగ్గరకు రాకపోవడం వాళ్ళు ప్రమాదానికి గురి అయియుండవచ్చు అని గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వం యంత్రాగం వారిని గుర్తించేందుకు పోలీస్, ఫైర్ ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలతో రిజర్వాయర్ లో గాలింపు చేపట్టింది. ఇట్టి సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ , ఎమ్మెల్యే రిజర్వాయర్ ను సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించగా పోలీస్, ఫైర్ సిబ్బంది మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, లాస్ట్ ఫోన్ సిగ్నల్ అందిన వివరాలు వారికీ వివరించడం జరిగింది. ఇట్టి విషయంలో మరిన్ని చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా గుర్తించాలని తెలియజేస్తూ ఎస్.డి.ఆర్.ఎఫ్ వారికి తగిన సూచనలు చేయడమైనది. రిజర్వాయర్ లో గల్లంతు అయిన సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే స్వయంగా బోటులో ప్రయాణించి పరిశీలించడం జరిగింది. అనంతరం గల్లంతు అయిన దంపతుల పిల్లలను జిల్లా ఎస్పీ , ఎమ్మెల్యే పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. వీరి వెంట డి.ఎస్.పి. వై. మొగిలయ్య, గద్వాల్ సిఐ శ్రీను, ఎస్.డి.ఆర్.ఎఫ్. ఆర్.ఐ. ఎమ్మార్వో జాన్సీ,గట్టు ఎస్సై కే.టీ. మల్లేష్, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..