

- టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రజలకు రేషన్ పంపిణీని మరింత సులభ పరిచేందుకు కూటమి ప్రభుత్వం “క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల పంపిణీ”చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ కాలనీలో పులి సునీత, బందిలి సరోజినీ ల రేషన్ డిపోల వద్ద తహసీల్దార్ తాతారావు అధ్యక్షతన స్మార్ట్ కార్డుల పంపిణీ నిర్వహించారు. “క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల పంపిణీ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిడిపి సీనియర్ నాయకుడు పర్వత సురేష్ మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టేందుకే కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను తీసుకువచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజలందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షోభంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని దీర్ఘ ఆలోచన కలిగి భావితరాల భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. అనంతరం తహసిల్దార్ తాతారావు, పర్వత సురేష్, సర్పంచ్ గనియమ్మ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందిలి గనియమ్మ, ఉపసర్పంచ్ చింతంనేడి కుమార్, బుర్ర వాసు, వరప్రసాద్, బుర్ర లచ్చ బాబు,రౌతు శ్రీను, బోట్ల లోవరాజు, బందిలి పాపారావు, బైరా రామారావు,ఎన్దియే కూటమి శ్రేణులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.