

జలదంకి, మన ద్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 2 :////
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భముగా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో జనసేన నాయకులు కృష్ణారావు గారు రామమూర్తి రమేష్ మధు శెట్టిపల్లి గారి ఆధ్వర్యంలో మండల కార్యాలయ ప్రారంభోత్సవం మరియు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి దానిని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి శ్రీ కాకర్ల సురేష్ గారి సహకారంతో వీలైనన్ని సమస్యలు పరిష్కరించి సమాజాభివృద్ధికి పాటుపడదామని ఆయన పిలుపునిచ్చారు.. ముఖ్యంగా జనసైనికులకి కూటమి ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తుంది కావున ఎవరు అధైర్య పడకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు వచ్చి జరిపించవలసిందిగా ప్రార్థన.. అందుకోసం మన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మన నాయకులు బోగినేని కాశీ రావు గారు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించేలా ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకొని బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు తనానికి ఒకడు పుడతాడని ఆయనలాగా నిస్వార్ధంగా ప్రజల కోసం ఏదో చేయాలని తన విలాసవంతమైన జీవితాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజా సమస్యల కోసం ప్రజాభివృద్ధి కోసం నవ సమాజ నిర్మాణం కోసం ఆయన పాటుపడుతూ ఉన్నాడు ఆయన జీవిత చరిత్ర ఆయన జీవిత గమనం భావితరాలకు ఒక దిక్సూచిలా ఒక ప్రేరణ కల్పించేలా ఉంటుంది ఉండబోతుంది అని బోగినేని కాశీరావు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో జలదంకి మండల కమిటీ శ్రీరామ్మూర్తి గారు రమేష్ గారు కృష్ణారావు గారు మధు శెట్టిపల్లి గారు జలదంకి మండల ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు మండల ప్రధాన కార్యదర్శి అరవింద్ గారు జమాల్ గారు, సురేష్ అండ్ టీం సభ్యులు, కరీము,రవి, సురేష్, మాధవరావు, వెంకటేశ్వర్లు. హనుమంత్ రావు, మాల్యాద్రి, మురళి, శివ, జయంత్, మదన్, అజిత్, ప్రవీణ్, S ప్రవీణ్, చరణ్, సీతారామపురం, కొండాపురం, వింజమూరు నుంచి నాయకులు, జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు..