

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
భారత జీవన బీమా సంస్థ (LIC) స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరాయకొండ కార్యాలయం నందు 69 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ సింగరాయకొండ బ్రాంచ్ మేనేజర్ కె కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 69 సంవత్సరాల నుండి ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని పొంది ప్రభుత్వ రంగానికి ఎక్కువ పెట్టుబడులు అందిస్తున్న సంస్థగా భారతీయ జీవిత బీమా సంస్థ ఎదిగిందని అన్నారు.అదేవిధంగా సంస్థ ప్రజలకు అందిస్తున్న విశ్వసనీయమైన బీమా సేవల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ, ఎల్ఐసీ ఆర్థిక భద్రత కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్ డి కె డి ప్రసాద్,సిబ్బంది, పాలసీ హోల్డర్లు, ఏజెంట్లు పాల్గొని కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకున్నారు.