

మన న్యూస్: పాచిపెంట, పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గత 20 ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కర్రివలస ప్రజలకు నేటికి మోక్షం కలిగింది. గ్రామ రహదారికి మహర్దశ కలిగింది.మరమ్మత్తులకు చేరుకొని ఏళ్ల తరబడి ప్రయాణికులు,పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంతవరకు ఏ ఒక్కరు పట్టించుకోలేదు. 2000 సంవత్సరం నుంచి ఇంతవరకు రహదారి లేక ఇబ్బందులు పడుతూ వచ్చారు. గత ప్రభుత్వం హయాంలోఈ రోడ్డు సిమ్మెంట్ రహదారి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఉపాధి నిధులు మంజూరు చేశారని పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మర్రి ఉమా మహేశ్వర రావు విలేకరులకు తెలియజేశారు. ప్రస్తుతం వర్షాలు దృష్ట్యా ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారని అందుచేత రహదారి నిర్మాణానికి రంగం సిద్ధం చేశామని పనులు వేగవంతంగా చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలుగుతాయని ఆయన విలేకరులకు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ పనులు చేపడుతున్నట్టు సర్పంచ్ ప్రతినిది ఉమా తెలిపారు. రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉమామహేశ్వర కు కర్రి వలస గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
