

బంగారుపాళ్యం సెప్టెంబర్ 01 మన ద్యాస :- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ ఆలయం వద్ద సోమవారం మద్యం షాపులో రిజెర్వేషన్ కల్పించినందుకు జిల్లా ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే జిల్లా టీడీపీ ఈడిగ సాధికారిక అధ్యక్షుడు బుసా నాగరాజ గౌడ్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు.ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్,చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు,ఎన్.పి.ధరణి ప్రసాద్,కృష్ణమూర్తి గౌడ్,బుసా జనార్థన్ గౌడ్,అట్లూరి వేణుగోపాల్, లెబాకుల మురళి,జిల్లా టిడిపి నాయకులు, నియోజకవర్గంలోని 5మండలాల టిడిపి అధ్యక్షులు,గౌడ సంఘం నేతలు,టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.