

గూడూరు, మన ధ్యాస :- గూడూరు నియోజకవర్గంలోనిచెన్నూరు గ్రామంలో డయాలసిస్ పేషెంట్ కి ప్రభుత్వం మంజూరు చేసిన 10000 రూపాయలను తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ, ఏ ఇంటికెళ్లినా, ఎవరిని అడిగినా, ఒకటో తేదీ తెలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారని చెబుతున్నారన్నారు. వృద్ధులకు 4 వేలు, వికలాంగులకు 6, డయాలసిస్ పేషెంట్ కి పదివేల రూపాయలు వేలు, బెడ్ రీడెన్ ఉన్నవారికి 15 వేలు ఇస్తున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేసేసి వెనుక్కునిట్టేసిందని అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయమని ఎంతోమంది అవహేళన చేశారని, చెప్పిన మాట చెప్పినట్టుగా సూపర్ సిక్స్ ని అమలు చేస్తున్నామని అన్నారు. అనుభవంతో రాష్ట్రాన్ని ఎలా నడపగలమో చంద్రబాబు చేసి చూపిస్తున్నారని వ్యారంభం మాత్రమేనని ఇంకా చాలా చేయబోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించే నమ్మకం కలిగిస్తుందని అందుకే లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలని ప్రశ్నించడం లేదు కాబట్టే పేదవారి కోసం కట్టిన ఇళ్లను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని అన్నారు. పెద్దల కోసం అద్భుతంగా కట్టిన ఇళ్లను ఇవ్వకుండా జగనన్న కాలనీల పేరుతో ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. మరో రెండు పర్యాయాలు కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలూరు కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.