

వింజమూరు, మన ధ్యాస ఆగస్టు 31 :– ఉదయగిరి మండలం కొట్టాయపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా గడ్డం వెంకటేశ్వర్లు గారు నూతనంగా ఎంపికయ్యారు. ఆ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం నాడు వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట సొసైటీ డైరెక్టర్లు గా ఎంపికైన బొజ్జ నరసింహులు గారు, నల్లిపోగు రాజా గారు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.