నెల్లూరు పురవీధుల్లో మహిళల స్త్రీ శక్తి భారీ ర్యాలీ

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30:సంక్షేమ పథకాలను అమలు చేయడం అన్ని ప్రభుత్వాలు చేసే పనే. కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చినా, ఖజానా ఖాళీ చేసి వెళ్లినా.. ఏమాత్రం తడబడకుండా పథకాల అమలు విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం అనే రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు విఆర్సి సెంటర్ నుండి పప్పుల వీధి వినాయకుడి గుడి వరకు సాగిన స్త్రీ శక్తి ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ……..అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను పట్టాలెక్కించింది, అధికారంలోకి వచ్చీ రాగానే పెన్షన్ల పెంపు ద్వారా తన చిత్తశుద్ధి నిరూపించుకుంది అని అన్నారు. పెన్షన్లు పెంచడమే కాదు, బకాయిలు కూడా చెల్లించి మంచి మనసు చాటుకున్నారు, సీఎం చంద్రబాబు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ పెన్షన్లు పెంచారు అని అన్నారు.ఏడాదికి రూ. 33వేల కోట్లు కేవలం పెన్షన్లకోసమే ఖర్చు చేయడం ఈ ప్రభుత్వం ఘనత అనే చెప్పుకోవాలి,తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకాన్ని వర్తింపజేయడం మరో సాహసం అనే చెప్పాలి అని అన్నారు.ప్రతి పిల్లవాడికి రూ.15వేలు చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.20వేలకు పెంచింది. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది అని అన్నారు.స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది అని అన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపై చేసి ఏడాదిన్నరలోనే రిక్రూట్ మెంట్ కూడా పూర్తి చేసి 16వేలమందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇవన్నీ ప్రచారం కోసం చెబుతున్న మాటలు కాదు, ప్రచార ఆర్భాటాలు ఎంతమాత్రం కాదు. హామీలు అమలైన వేళ మహిళామణులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.నెల్లూరు పురవీధుల్లో మహిళలు ప్రభుత్వనికి ధన్యవాద ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మొదలైన ఈ ర్యాలీ పప్పుల వీధి వరకు సాగింది. దారి పొడవునా మహిళలు నినాదాలతో హోరెత్తించారు. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అంటూ ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో జరిగిన ఈ ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అయింది. 5వేలమంది వస్తారని అంచనా వేస్తే.. దాదాపు 10వేలమందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారని సంతోషం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ . మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆధ్వర్యంలో మహిళా నేతలు కదం తొక్కారు.మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ, నెల్లూరు సిటీ నియోజకవర్గ మహిళా క్లస్టర్లు కపిర రేవతి ,విజయమ్మ ,శ్రీలక్ష్మి ,అంచురు జానకి ,మంజుల ,శిల్పా ,చందన,గౌసున్నీసా ,డిప్యూటీ మేయర్ తాహసీన్ ఇంతియాజ్ , బీజేపీ, జనసేన నేతలు, మహిళా కార్పొరేటర్లు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు పుర వీధుల్లో సూపర్ సిక్స్-సూపర్ హిట్ అంటూ నినాదాలు చేస్తూ మహిళలు ముందుకు కదిలారు. సూపర్ సిక్స్ పథకాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మహిళా నేతలు ప్రసంగించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సూపర్ సిక్స్ పథకాలను అమలులో పెట్టిన సీఎం చంద్రబాబు కి ధన్యవాదాలు తెలిపారు పొంగూరు రమాదేవి. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. దానికి నిదర్శనం నెల్లూరు పురవీధుల్లో కనపడిన మహిళలేనని అన్నారు. మహిళలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి చెప్పామని, అప్పట్లో ప్రత్యర్థులు తమని హేళన చేశారని, నిధులు లేవన్నారని, కానీ ఇప్పుడు ఆ పథకాలను అమలు చేసి చూపించామని చెప్పారు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ. మాజీ సీఎం జగన్ పరదాల ముఖ్యమంత్రి అని, ఆయన ఎప్పుడూ జనంలోకి రాలేదనివిమర్శించారు. నిధులున్నా లేకపోయినా తమ సీఎం చంద్రబాబు పథకాలు అమలు చేసి చూపించారన్నారు. గత ప్రభుత్వహయాంలో నెల్లూరు నుంచి మంత్రి అయిన వారు ఖజానా ఖాళీ అని చెప్పారని, కానీ నేటి మంత్రి నారాయణ హయాంలో నెల్లూరుకి నిధుల వెల్లువ వచ్చిందన్నారు. నారాయణ మాటలు చెప్పే మంత్రి కాదని, పనిచేసే మంత్రి అని వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చి, మహిళలకు మద్దతిచ్చిన మంత్రి నారాయణ గారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనం అని అన్నారు మంత్రి నారాయణ. 2014-2019 మధ్య కాలంలో నెల్లూరు నగర అభివృద్ధి కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. 2014-19 నుంచి రూ.960 కోట్లు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా పైప్ లైన్ల నిర్మాణం చేపట్టామని, దాదాపు 90శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని, ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన నిధుల్ని విడుదల చేయించామని చెప్పారు నారాయణ గారు. రూ.165 కోట్లు విడుదల చేయించి నెల్లూరుని సుందరంగా మార్చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ చివరిలోగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని, మరో ఏడాదిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కూడా పూర్తవుతుందన్నారు. దోమలు లేని నగరంగా నెల్లూరుని మార్చేస్తున్నట్టు చెప్పారు. నిధులు ఉండి పథకాలు అమలు చేయలేదని, కేవలం ఇచ్చిన మాట కోసమే సూపర్ సిక్స్ పథకాలను ఇంత త్వరగా అమలులోకి తెచ్చామని చెప్పారు మంత్రి నారాయణ . గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి ఉంచారన్నారు. అయినా కూడా తాము పథకాలు అమలు చేశామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని చెప్పారు. స్త్రీ శక్తి ర్యాలీలో పాల్గొన్న మహిళలకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ