

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బాల్య వివాహాలు చట్టరిత్య నేరమని ప్రత్తిపాడు కోర్టు న్యాయమూర్తి లంక గోపీనాథ్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 21వ శతాబ్దంలోనూ బాల్య వివాహాలు జరిపించడం దురదృష్టకరమన్నారు.బాల్య వివాహాలు జరిపించిన, ప్రోత్సహించిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వివాహ వయసు రాకుండా బాలికలకు వివాహాలు జరిపించడం వల్ల మానసికంగాను,శారీరకంగానూ ఇబ్బందులు తప్పవన్నారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ చిట్టిబాబు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో సైతం బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే ఐసిడిఎస్ అధికారులకు, అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం అందించాలని కోరారు. ప్యానల్ అడ్వకేట్ అవసరాల దేవి మాట్లాడుతూ మహిళలకు కల్పించిన ప్రత్యేక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బుగతా శివ, చిట్టం శెట్టి పుల్లయ్య, న్యాయవాదులు బి జాన్బాబు,ఎం రత్నకుమారి, సి డి పి ఓ పద్మావతి, డాక్టర్ పద్మావతి అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, ఉన్నారు.