

మన న్యూస్: కామారెడ్డి జిల్లా ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపిన దివ్యాంగులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు అందరు కలిసి నిరసన తెలిపారు ఈ నిరసనకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు సుజాత హాజరై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను మరచిపోయి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేయడం జరుగుతుందని సమాజంలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది దివ్యాంగులు పెన్షన్ రాక అధికారుల వద్దకు వెళ్లి సర్టిఫికెట్ కావాలని అడిగితే డబ్బులు తీసుకుంటూ సర్టిఫికెట్లు ఇస్తున్నారని అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దివ్యాంగులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగులు కానప్పటికీ నకిలీ సర్టిఫికెట్లు ఇస్తూ చాలామంది లబ్ధి పొందుతున్నారని అలాంటి వారి సర్టిఫికెట్లు రద్దు చేయాలని నిజమైన దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు.