

ఉదయగిరి మన న్యూస్ ప్రతినిది నాగరాజు, ఆగస్ట్ 28 :///
ఉదయగిరి మండల పరిధిలోని ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతంలో ప్రధాన సమస్యగా మారిన కరెంటు లైన్ మ్యాన్ ఆగడాలు రోజురోజుకీ అతిక్రమిస్తున్నాయి. వారి యొక్క దుస్సాహసానికి ప్రజలు భయపడుతూ.. నెల వచ్చేసరికి కరెంట్ బిల్లు కట్టడానికి అవస్థలు పడుతూ కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజు పీకి వేస్తారేమో అని పేదవాడు భయాందోళనకు గురవుతున్నారు. రోజు కూలి పని చేసుకునే వ్యక్తి నెల వచ్చే సరికి కరెంట్ బిల్లు కట్టలేదని కరెంటు లైన్ మెన్ వచ్చి చెప్పా పెట్టకుండా ఫీజ్ పీకేసి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటి అని నిరుపేదలు బాడుగ ఇండ్లలో ఉండేటువంటి వారు లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పీకేశాడు అన్న సంగతి ఆ ఇంటి యజమానికి తెలిస్తే ఎక్కడ ఇల్లు ఖాలీ చేయమంటాడో ,అని ఆవేదన చెందుతున్నారు. నెల వస్తుందంటే భయం ఒక పూట అన్నమైన మానుకొని కరెంట్ బిల్లు కోసం డబ్బులు దాచి పెట్టకపోతే చీకటి ఇంట్లో పసిపిల్లలను పెట్టుకొని ఎక్కడ చీకటిలో ఉండవలసి వస్తుందో అన్న భయం ప్రతి పేదవాడి గుండెల్లో గుబేలు మనిపిస్తుంది. లైన్ మ్యాన్ ఎప్పుడు వస్తాడో అని భయం విషయం ఏంటి అంటే విద్యుత్ చట్టాల మీద అవగాహన లేకపోవడమే ఒక లైన్ మ్యాన్ తాను చేస్తున్న పనిమీద కనీస అవగాహన తనకే పూర్తి అవగాహన లేకపోవడం తనపై అధికారి కూడా తనకి తెలియ చెప్పకపోవడం వల్ల లైన్ మ్యాన్ విద్యుత్తు వినియోగదారునికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన ఇష్టానుసారంగా ఫ్యూజ్ పీకేసి చెప్పకుండా వెళ్లిపోవడం సరి అయినది కాదని గ్రామస్తులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కనీసం గృహ నిర్వాహకుని పిలిచి కరెంట్ బిల్లు ఎందుకు కట్టలేదని కానీ ఎప్పుడు కడతావు అని వెళ్లి ఇప్పుడైనా కట్టి రండి అని అయినా చెప్పకుండా అర్ధాంతరంగా ఫీజు పీకి వేసి వెళ్లిపోవడం చాలా విచారకరం ఇలా చేసిన లైన్ మ్యాన్ మీద సంబంధిత అధికారుల మీద కూడా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003.56.ప్రకారం ముందస్తు గా వినియోగదారునికి నోటీసు ఇవ్వాలి అలా నోటీసు ఇవ్వకుండా ఫీజు తొలగించే అధికారం లైన్ మ్యాన్ కి కానీ ఏ.ఈ కి కానీ డి.ఈ కి కానీ లేదు ఒకవేళ వినియోగదారుడు ఇంట్లో లేని సమయంలో అతనికి స్పీడ్ పోస్ట్ ద్వారా విద్యుత్తుకు సంబంధించిన నోటీసు పంపించవలసి ఉంటుంది నోటీసు పంపించిన కూడా 15 రోజులు గడువు ఇవ్వవలసి ఉంటుంది 15 రోజులు గడిచిన తర్వాత కూడా వినియోగదారుడు స్పందించకపోతే ఎలక్ట్రిసిటీ అధికారి వచ్చి ఫీజు తొలగించే అధికారం కలిగి ఉంటాడు ఇలా కాకుండా లైన్ మ్యాన్ ఫీజు పీకేసి వెళ్లినట్లయితే అతని మీద అతనిపై అధికారులు మీద ఇండియన్ పీనల్ కోడ్. సెక్షన్188. సెక్షన్ 447 సెక్షన్ 448 సెక్షన్ 506 ప్రకారం వారి మీద క్రిమినల్ కేసు పెట్టే అధికారం వినియోగదారునికి ఉంటుంది అలాగే వినియోగదారుడు తనకు పరువు నష్టం జరిగినందుకు కన్స్యూమర్ కోర్టులో దావా వేసుకునే హక్కు వినియోగదారులుకుంటుంది పరువు నష్టం జరగడానికి కారకులైన ఎలక్ట్రిసిటీ అధికారులు దగ్గర నుండి 10 లక్షల వరకు నష్టపరిహారం పొందే హక్కు వినియోగదారుడు కలిగి ఉంటాడు వినియోగదారుడే రాజు అని 2019 ప్రకారం వినియోగదారులు అక్కు కలిగి ఉంటారని తెలియజేయడం జరిగింది. ఇకపై లైన్మెన్ యొక్క ఆగడాలు అతిక్రమించకుండా పై స్థాయి అధికారులు చర్యలు తీసుకుని ప్రజల పట్ల అంకితభావంతో స్నేహపూర్వక నడవడికను అవలంబించుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటారని పేద ప్రజలు కోరుకుంటున్నారు.