

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను ప్రభుత్వం పునరావాసం కల్పించింది.గోర్గల్ ఫంక్షన్ హాల్‌లో సుమారు 120 మందికి వసతి కల్పించబడింది,వీరిలో సుమారు 35 కుటుంబాలు తాత్కాలిక పునరావాసం పొందాయి.బాధితులకు భోజన వసతి సహా అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.ఈ పునరావాస కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు బాధితులను పరామర్శించారు.ప్రజల సమస్యలు తెలుసుకుని తగిన సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,తహసీల్దార్ బిక్షపతి,
ఎంపీడీవో గంగాధర్,నాయకులు ప్రజా పండరి,శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.