

– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ.
ఉరవకొండ,మన ధ్యాస :
-ఆమిద్యాల నుంచి ఐదుగురు.
-మోపిడి నుంచి నలుగురు
-కౌకుంట్ల నుంచి ఇద్దరు
-రాకెట్ల నుంచి ఇద్దరు.
-13మంది అగ్రకుల పాలకులు.
01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాలకమండలి అధ్యక్షులుగా ఇప్పటివరకు 14 మంది కొనసాగారు. వీరిలో 13 మంది పురుషులు ఉన్నారు. ఒక మహిళ ఉన్నారు. పాలకమండలి అధ్యక్షులుగా పనిచేసిన వారు అధిక శాతం ఉన్నత వర్గాలకు చెందిన వారే. 14 మందిలో 13 మంది అగ్రకులస్తులు, ఒక్కరు బీసీ కులానికి చెందినవారు. 12 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఒక్కరు బ్రాహ్మణులు మరొకరు బీసీ కులానికి చెందిన చేనేత కులస్తులు..
మోపిడికి చెందిన నలుగురు పాలకమండల అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉండగా, ఆమిద్యాల నుంచి ఐదుగురు అధ్యక్షులుగా పనిచేస్తే, కౌకుంట్ల రాకెట్ల గ్రామాల నుంచి ఇద్దరు ఇద్దరు చొప్పున పని చేయగా, ఉరవకొండ నుంచి ఒక్కరు పని చేశారు. పనిచేసిన పాలకమండలి అధ్యక్షులుగా ఒక్క మహిళ ఉన్నారు. ఇప్పటివరకు ఐదు పాలకమండలి అధ్యక్ష స్థానాలు ఆమిద్యాల గ్రామవాసులకే దక్కాయి. తొలి పాలకమండలి అధ్యక్షులుగా మోపిడి గ్రామానికి చెందిన కరణం నరసప్ప పని చేశారు.
తొలి పాలకమండలి అధ్యక్షురాలుగా ఆమిద్యాల గ్రామానికి చెందిన గుర్రం రంగనాయకమ్మ ఉండగా, తిరిగి ఈ ఏడాది పాలక మండల అధ్యక్ష స్థానంలో దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ బరిలో ఉన్నారు..
పని చేసిన పాలకమండలి అధ్యక్ష వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసిన వారి వివరములు
1. శ్రీ కరణం వెంకట నరసప్ప మోపిడి గ్రామానికి చెందిన వారు, 1940 నుండి 1945 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
2. శ్రీ గుత్తా వెంకట రమణప్ప మోపిడి గ్రామానికి చెందిన వారు, 1945 నుండి 1950 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
3. శ్రీ దగ్గుపాటి రామప్ప, మోపిడి గ్రామానికి చెందిన వారు, అధ్యక్షులుగా పనిచేశారు.
4. వేలూరు ఎర్రప్ప ఆమిద్యాల గ్రామానికి చెందిన వారు, అధ్యక్షులుగా పనిచేశారు.
5. శ్రీ మేకల పెరివిలప్ప, మోపిడి గ్రామానికి చెందిన వారు, అధ్యక్షులుగా పనిచేశారు.
6. శ్రీ మదమంచి తిమ్మప్ప , కౌకుంట్ల గ్రామానికి చెందిన వారు, అధ్యక్షులుగా పనిచేశారు.
7. శ్రీ వేలూరు రామప్ప , ఆమిద్యాల గ్రామానికి చెందిన వారు, 1960 నుండి 1970 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
8. పయ్యావుల వెంకటనారాయణ కాకుంట్ల గ్రామానికి చెందిన వారు, 1970 నుండి 1980 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
9. శ్రీ గుర్రం శ్రీరాములు , ఆమిద్యాల గ్రామానికి చెందిన వారు, 1980 నుండి 1984 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
10. శ్రీమతి రంగ నాయకమ్మ , ఆమిద్యాల గ్రామానికి చెందిన వారు, 1984 నుండి 1985 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
11. శ్రీ వేలూరు కొండప్ప ఆమిద్యాల గ్రామానికి చెందిన వారు, 1985 నుండి 1990 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
12. శ్రీ పెదకోట్ల రామప్ప ఉరవకొండ గ్రామానికి చెందినవారు.
13. శ్రీ ముత్తలూరి ఓబన్న రాకెట్ల గ్రామానికి చెందినవారు, 2008 నుండి 2012 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
14. శ్రీ ముత్తలూరి అశోక్ కుమార్ రాకెట్ల గ్రామానికి చెందినవారు, 2020 నుండి ఇప్పటివరకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
