పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, మక్తల్ సీ ఐ రామ్ లాల్.

మన ధ్యాస నారయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల అదికారులు, హిందూ, ముస్లిం మత పెద్దలు, మంటపలా నిర్వాహకులతో శాంతి సమావేశం నిర్వహించడం జరిగిందని సిఐ రామ్ లాల్ తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలులో భాగంగా గణేష్ శోభాయాత్ర సమయంలో విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలను నోట్ చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రజలంతా పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి లు మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండుగలను ప్రజలంతా కులమతాలకతీతంగా సామరస్యంగా శాంతియుతంగా జరుపుకోవాలని సిఐ తెలిపారు. మక్తల్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా తమ వంతుగా ఉత్సవ కమిటీలు ముఖ్య పాత్ర పోషించాలని, యువతకు పెద్దలు దిశా నిర్దేశం చేయాలని కోరారు. డీజే లకు అనుమతి లేదని ఎవరైనా డీజేలు పెడితే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, నిమర్జనం అయ్యే వరకు ప్రతి గణేష్ మండపానికి 24 గంటలు భద్రత కల్పిస్తాం, సిఫ్ట్ ల వారీగా సిబ్బంది విధులు నిర్వహిస్తారని అన్నారు. మంటలపాల దగ్గర కచ్చితంగా వాలంటీర్లు ఉండాలని తెలిపారు. ఉత్సవాలను ఒకరిపై ఒకరు పోటీ కోసం జరప వద్దని అందరూ కలిసిమెలిసి భక్తి భావంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సిఐ గారు విజ్ఞప్తి చేశారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు మండపాల ఏర్పాటుకు ముందస్తుగా ఆన్లైన్ పోలీసు పోర్టల్ లో అనుమతులు తీసుకోవాలని కోరారు. ఎక్కడ ఏ విగ్రహం ఏర్పాటు చేశారనేది పోలీసు వారి దృష్టిలో ఉంటే అత్యవసర సమయంలో భద్రత కల్పించడం సులువు అవుతుంది, సెక్టార్ల వారీగా పోలీస్ సిబ్బంది అనుక్షణం విధులు నిర్వహిస్తారని తెలిపారు. మండపాల ఏర్పాటు సమయంలో నాణ్యమైన సామాగ్రి ఉపయోగించాలి, మంచి కరెంట్ వైర్ ఉపయోగించాలి, మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ కోసం నీటి బకెట్స్, ఇసుక బకెట్స్, వంటివి అందుబాటులో ఉంచుకోవాలి, ఉత్సవ కమిటీ వారు అందుబాటులో ఉండాలి అని కోరారు. వివాదాస్పదమైన స్థలం లో మండపాలు ఏర్పాటు చేయొద్దు, రోడ్లపై ఏర్పాటు చేయొద్దు అని నిమర్జనం శోబాయాత్ర లో ఉపయోగించే వాహనం కండిషన్ లో ఉండాలి, పిల్లలను శోభాయాత్ర వాహనాలు ఎక్కించవద్దు అని కోరారు. బానా సంచా నిషేదం. భక్తి పాటలు ప్రసారం చేయాలి, రాత్రి 10 గంటల తర్వాత మైక్ లు పెట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు. మట్టి గణేష్ ను ఏర్పాటు చేయడం పర్యావరణానికి మంచిది అని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, తప్పుడు సమాచారంతో ఎవ్వరూ ఉద్రేకానికి లోనై చట్ట ఉల్లంఘనకు పాల్పడవద్దు, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. పండుగల శోభాయాత్ర సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ గణేష్ మార్గ్ నీ పరిశీలించడం జరిగిందని అవసరమైన ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, AE విద్యుత్ అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు హిందూ ముస్లిం మత పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..