

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కోరారు. కళాశాలలో బి.యస్సీ (బోటాన్) బి.యస్సీ (కంప్యూటరు సైన్స్), యస్సి (కెమిస్ట్రీ) బి ఏ (ఎకనామిక్స్) బి. కాం ( కంప్యూటరు) కోర్సులందు ప్రవేశాలకు అవకాశం ఉన్నరని. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు డిగ్రీ ప్రవేశాలకు అర్హులని, కళాశాల లో నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం కూడా కల్పించదమైనదని కళాశాల ప్రిన్సిపల్ డా. సునీత ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి కళాశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ లు, అదనపు కంప్యూటరలతో లాబ్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయని ప్రధాన మంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్ పథకం లో భాగంగా 5 కోట్లు రూపాయలతో కళాశాల నందు అభివృద్ది కార్య క్రమాలు జరుగుతున్నాయని ఈ సౌకర్యాలన్ని కళాశాలలో ప్రవేశం పొంది ఉపయోగించు కోవాలని ఆమె కోరారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు కళాశాలకు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొన్న విద్యార్థిని, విద్యార్థులకు, ఓసీ విద్యార్థులకు 400 రూపాయలు బి సి విద్యార్థులకు 300 రూపాయలు, ఎస్ సి మరియు ఎస్ టీ విద్యార్థులకు 200 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము కళాశాల ఉచితంగా చెల్లిస్తుందని తెలియజేశారు