

మన ధ్యాస, నారయణ పేట జిల్లా :
ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధమైన సంఘటన నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుడిసెల కుర్మన్న తండ్రి సువన్న తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి తన పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లడం జరిగింది. తన గుడిసెకు పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న తమ్ముడీ గుడిసె కూడా అంటుకోవడంతో మంటలు వ్యాపించడం జరిగింది. తమ్ముడిని గుడిసె నుండి బయటకు తీసుకొచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు మంటలు పెద్ద మొత్తంలో ఎగిసి పడి వ్యాపించడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. గుడిసెలో ఉన్న బంగారు, వెండి తోపాటు నగదు, బట్టలు ఇతర సామాన్లు కాళీ బూడిద అయిపోయాయి, గుడిసెలలో ఉన్న సిలిండర్లు పేలిపోయాయని తెలిపారు.సుమారు 14 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు,గుడిసెల కురుమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.