రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా :

175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు.

5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్ ఛాయ్ సైతం తాపించాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లకు కేటాయిస్తోందని, లబ్దిదారులు త్వరగా ఇండ్లు కట్టుకొని, నాలుగు విడతల్లో 5 లక్షల రూపాయలు తీసుకోవాలని రాష్ట్ర పాడి పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడా,యువజన మరియు మత్స శాఖామంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండల పరిధిలోని జక్లేర్ గ్రామంలో 19 మంది, కాట్రేవ్ పల్లి గ్రామంలో 26, ఖానాపూర్ గ్రామంలో 12 మంది, రుద్రసముద్రం గ్రామంలో 11 మంది, పారేవుల గ్రామంలో 10 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ,లబ్దిదారులు త్వరగా ఇండ్లు కోవాలని, రెండో విడతలో మరికొన్ని ఇండ్లను సైతం కేటాయిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై గిట్టని వారు లేని పోని ప్రచారం చేస్తారని, అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు తొలి విడత లక్ష రూపాయలు అకౌంట్లలో జమ అయ్యాయని, వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లుగా ఒక్క ఇంటిని కేటాయించలేదని, అప్పుడు ఇప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను అందించింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, ఎ.రవి కుమార్, కోళ్ల వెంకటేష్, కావలి తాయప్ప, మార్కెట్ డైరెక్టర్లు పారేవుల విష్ణు, శాలం, నాయకులు శంషుద్దీన్, కట్టా వెంకటేష్, కావలి ఆంజనేయులు, చెన్నయ్య గౌడ్, కల్లూరి గోవర్దన్, గుంతలి రవి, ఎంపీడీవో రమేష్, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!