నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం నందు ఆక్వా కల్చర్ విభాగా ఆధ్వర్యంలో మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం..///

నెల్లూరు/ మన న్యూస్ ప్రతినిధి నాగరాజు /ఆగస్ట్ 25 :///

కార్ప్ కల్చర్‌లో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈ రోజు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (KVK), ఆక్వాకల్చర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ శిక్షణలో ఆక్వా రైతులు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విశ్రాంతి అధ్యాపకుడు డాక్టర్ నరసింహారెడ్డి గారు “స్ట్రెస్ మేనేజ్‌మెంట్” అంశంపై ప్రసంగించారు. వృత్తి సంబంధిత ఒత్తిడి ప్రతి రంగంలో అధికమవుతోందని, రైతులు శారీరక – మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన సూచించారు. సమయపాలన, యోగా, ధ్యానం, సానుకూల దృక్పథం వంటి చర్యలు రైతుల పనితీరును మెరుగుపరుస్తాయని వివరించారు.తదుపరి సాంకేతిక సమావేశంలో శ్రీ హరి సాదు గారు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం, కేవీకే నెల్లూరు) “నీటి యాజమాన్య పద్ధతులు” అనే అంశంపై వివరించారు. ఆయన మాట్లాడుతూ చేపల జీవనమంతా నీటిపైనే ఆధారపడి ఉండటంతో నీటి నాణ్యత నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. చేపల పెంపకానికి అనుకూలమైన నీటి ఉష్ణోగ్రత 24–30 డిగ్రీల మధ్య ఉండాలి. నీటిలో కరిగిన ఆమ్లజనకం (DO) కనీసం 5 మి.గ్రా/లీ. కంటే తక్కువ కాకూడదు. పిహెచ్ విలువ 7.8–8.5 మధ్య, క్షారత్వం 50–150 మి.గ్రా/లీ. మధ్య ఉంటేనే చేపలకు అనుకూలమని తెలిపారు. అమోనియా, నైట్రైట్ స్థాయిలు అధికమైతే చేపలకు విషప్రభావం కలుగుతుందని, అందువల్ల అధిక ఆహారం వేయకూడదని, సమయానుకూలంగా నీటిని మార్చడం, గాలిమిశ్రమ యంత్రాలు (aerators) ఉపయోగించడం అవసరమని సూచించారు. పీహెచ్ సరిచేయడానికి సున్నం లేదా డోలోమైట్ వాడాలని చెప్పారు. అంతేకాకుండా, పంటకు ముందు చెరువును శుభ్రపరచి సక్రమంగా సిద్ధం చేయడం, సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా plankton వృద్ధి జరుగుతుందని, ఇది చేపలకు సహజ ఆహారం అందిస్తుందని వివరించారు. నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించి తగిన చర్యలు చేపడితే చేపల వృద్ధి మెరుగై ఉత్పత్తి పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతులు అంత ఏక ధాటిగా ఒక ప్లాట్ఫారం మీదకు వచి రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి వల్ల సంఘటిత శక్తిని పెంపొందించుకుని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలని డాక్టర్ ఎస్ లోకేష్ బాబు గారు సూచించారు.ఈ శిక్షణ ద్వారా పాల్గొన్న రైతులు ఒత్తిడి నిర్వహణ పద్ధతులు, నీటి నాణ్యత పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై విలువైన జ్ఞానం పొందారు. కేవీకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది..

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views

    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///