

కలిగిరి : మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ://///
కలిగిరి ఎస్సై ఉమా శంకర్ ఆయన సాధారణంగా కనిపిస్తాడు, నిత్యం ప్రజలతో మమేకమవుతాడు, సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. పేదలకు సమస్య అని స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరు ఉన్న ఆప్యాయంగా పలకరించి సమస్యను తెలుసుకొనుటలో, ఆ సమస్యను పరిష్కరించే విధానంలో ఆయన ఆయన విభిన్న శైలికి నిదర్శనం. మోములో చెరగని చిరునవ్వు, పోలీస్ అంటే జనాల్లో భయం, బిడియం లేని నిరాడంబరతను , ప్రజల్లో మమేకమవుతూ శభాష్ పోలీస్ బాస్ అనిపించుకుంటున్న మన కలిగిరి ఎస్సై ఉమాశంకర్. ఉమా శంకర్ పేరు చెప్పగానే ప్రజల్లో భయం కన్నా ఆప్యాయత ఎక్కువగా కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలు మన్ననలు అందుకుంటున్న ఎస్సై ఉమాశంకర్. ఆగస్టు 15 ఉత్తమ పోలీస్ అధికారిగా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్న మన కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ను, మదర్ తెరిసా మిరాకిల్ ఫౌండేషన్ చైర్మన్ శాంసన్,ఈశ్వర్,మరియు సభ్యులు శాలువాతో సత్కరించి ఫోటో ప్రతిమను బహుకరించారు.ఈ సందర్బంగా శాంసన్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ తరుపున ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసిన తప్పకుండా ఎస్సై ఉమశంకర్ రావడం మమ్మల్ని అభినందించడం జరుగుతుందన్నారు. సేవా గుణం కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడేరు. పోలీస్ అనే పదానికి కొత్త నిర్వచనం అందించిన కలిగిరి ఎస్సై ఉమశంకర్ కు మా మదర్ థెరిస్సా మీరాకీల్ ఫౌండేషన్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అని వారు అన్నారు.