

- వ్యవసాయ అధికారి పి గాంధీ..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:-
వివిధ కషాయాలతో చీడ పీడలను నివారించవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. శంఖవరంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరి,ప్రత్తి,కూరగాయల పంటలులో ఆశించే చీడపీడల నివారణకు రైతులకు అందజేయడానికి జీవామృతం, నీమాస్త్రం, తూటీకాడ కషాయం,బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం తయారు చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు.పొలం గట్లపై కంది సాగు,రాగి సాగు గూర్చి వివరించారు.అనంతరం సిబ్బందితో ద్రవ తయారీని పరిశీలించి సూచనలు ఇచ్చారు.అనంతరం వారిలో ఆశించిన ఆకు ముడత లక్షణాలు,నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. ఏ ఈ ఓ శ్రీనివాస్,సిబ్బంది లోలక్షి, బాబురావు,రమేశ్,వెంకటేశ్వర్లు,కుమారి,నాగలక్ష్మి,కామేశ్వరి,రజనీ,రైతులు పాల్గొన్నారు.