

- ఎంపీడీవో లక్ష్మిరెడ్డి
- శంఖవరంలో” స్వేచ్ఛ ఆంధ్ర ప్రదేశ్- స్వేచ్ఛ దీవస్”కార్యక్రమం…
శంఖవరం, మన న్యూస్ ప్రతినిధి:-
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎంపీడీవో లక్ష్మి రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలో శనివారం ఆయా శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్.. స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ పై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించి, గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ దోమల నిర్మూలన అందరిబాధ్యత అని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయా శాఖ అధికారులకు ఎంపీడీవో సూచించారు. పంచాయితీ అధికారి అప్పలరాజు మాట్లాడుతూ వ్యాపారులు, ప్రజలు చెత్తను రహదారులు, డ్రైనేజీల్లో వేయకుండా సహకరించాలని పరిశుభ్రతతోనే దోమలు వ్యాప్తిని అరికట్ట వచ్చునని, భోజనం చేసే సమయంలో ప్రతి ఒక్కరు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వై నాగలక్ష్మి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కుర్రే వెంకటేశ్వరరావు, దేవుళ్ళు, ఉద్యోగులు ఈవో పి ఆర్ డి, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.