
మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 23 :నెల్లూరు, ప్రెస్ క్లబ్ లో శనివారం సినీ ఆర్కెస్ట్రా ముజీషియన్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారు ప్రెస్ మీట్ నిర్వహించినారు. ఈ ప్రెస్ మీట్ లో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి .రాజశేఖర్ మాట్లాడుతూ…….. ప్రస్తుతం సినీ ఆర్కెస్ట్రా ముజీషియన్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు ఉన్న కమిటీ పదవి కాలం ముగియుచున్నందున త్వరలో ఎన్నికలు జరుగుతాయి అని అన్నారు.ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ లిస్టు తయారు చేయవలసి ఉన్నందున అసోసియేషన్ సంబంధించిన కళాకారులు( గాయని గాయకులు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు ,ఆర్గనైజర్లు) అందరూ కూడా తమ యొక్క అమూల్యమైన ఓటును నమోదు చేసుకోనవలసినదిగా కోరుచున్నాము అని అన్నారు. ఓటు నమోదు ప్రక్రియ 24 ఆగస్టు2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు తేదీ లోపల పాత సభ్యులు మరియు కొత్త సభ్యులు అందరూ కూడా తమ ఓటును నమోదు చేసుకోవాల్సినదిగా కోరడమైనది అని అన్నారు.తదనంతరం ఎలక్షన్ జరుగు తేదీ, ఎలక్షన్ ఆఫీసర్ మరియు ఎన్నిక జరిగే ప్రదేశము మిగతా సమాచారం త్వరలో తెలియజేయబడును అని తెలిపారు.ఎన్నికల జరపవలసిన పోస్టులు అధ్యక్షులు 1;సహాధ్యక్షులు 1 ;ఉపాధ్యక్షులు 2 కార్యదర్శి 1; జాయింట్ సెక్రెటరీలు 3 ;ట్రెజరర్ 1 వీటికి ఎన్నికలు జరుపబడును అని తెలిపారు.తెలపబడిన పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికల నిర్వహించబడును. ఎన్నికలలో గెలిచిన కొత్త కార్యవర్గము మండలమునకు ఒకరు చొప్పున జిల్లా కౌన్సిల్ మెంబర్ (డీ.సీ.ఎం)లను మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ (ఈసీ)లను నియమింతురు.. కనుక ముందుగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరడమైనది అని తెలియజేశారు. మరిన్ని విషయాల కొరకు అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ సెల్ నెంబర్ 9848246418 సంప్రదించగలరు అని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో డాక్టర్ పి. రాజశేఖర్ రాయల్ భాస్కర్, డి. జీవన్ ,ఐ .ఎం మిశ్రా ,చిరంజీవి పాల్గొన్నారు.
