

మన న్యూస్, ఇందుకూరుపేట: మైపాడును కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు నాయుడు సంకల్పం.- బంగారమ్మ ఆలయ నిర్మాణంతో మైపాడు బీచ్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. – పి4 కార్యక్రమం ద్వారా ఉప్పు కాలువలో సిల్ట్ క్లియరెన్స్ కు ముందుకు వచ్చిన స్థానికులను అభినందనలు. – టూరిస్టుల భద్రత కోసం బీచ్ లో లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. – మైపాడు – నెల్లూరు రహదారి త్వరతగతిన పూర్తి చేసి మైపాడు అభివృద్ధికి కృషి. – శరవేగంగా జరుగుతున్న ముదివర్తి – ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణం ద్వారా తీరప్రాంత వాసుల ఉప్పునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. మైపాడు బీచ్ ను ఒక సమగ్ర ప్రణాళికతో.కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి మైపాడులో నిర్వహించిన బీచ్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మైపాడు బీచ్ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణపై జిల్లా కలక్టర్ మరియు టూరిజం అధికారులతో ఆమె చరించారు. అనంతరం బీచ్ సమీపంలో నిర్మిస్తున్న బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సంబంధించి ద్వారబందర ప్రతిష్ట కార్యక్రమమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……. మైపాడు బీచ్ సమీపంలో వున్న ఉప్పు కాలువలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో పి4 కార్యక్రమం ద్వారా సిల్ట్ క్లియరెన్స్ కు ముందుకు వచ్చిన స్థానికులను అభినందించారు. ఈ సిల్ట్ క్లియరెన్స్ చేయడం ద్వారా మత్స్యకారుల బొట్లు నేరుగా సముద్రంలో వెళ్లేందుకు రూట్ క్లియర్ అవుతుందన్నారు. దాదాపు 6 కిలోమీటర్లు వున్న ఉప్పు కాలవలో కేరళ తరహా బోట్ రైడింగ్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. వీకెండ్స్ లో కుటుంబ సమేతంగా సరదాగా గడపాలంటే నెల్లూరు జిల్లాలో వున్న ఏకైక పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్.ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో పర్యాటకులు నెల్లూరు నుంచి మైపాడు బీచ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ప్రధాన అవరోధంగా ఉండేదని గత ప్రభుత్వ హయాం లో కేవలం శిలా ఫలకానికే పరిమితం అయి వున్న మైపాడు నెల్లూరు రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక కదలిక వచ్చిందని త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామన్నారు. మైపాడులో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటల్స్, రిసార్ట్‌లు, హోమ్ స్టేలు, ఫుడ్ కోర్టులు వంటి సౌకర్యాల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. టూరిస్టుల భద్రత కోసం బీచ్ లో లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మైపాడు బీచ్ తో పాటు ఇందుకూరు పేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . తాను నేను ఎమ్మెల్యేగా గెలుపొందాక ఇందుకూరు పేట మండలంలో లో ఓల్టేజి సమస్యను నివారించేందుకు కుడితి పాళెం వద్ద 33కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో శంఖుస్థాపనకే పరిమితం అయి వున్న ముదివర్తి – ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణాన్ని వేగవంతం చేసామన్నారు. పెన్నానదిపై ముదివర్తి – ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణం పూర్తయితే ఇందుకూరు పేట – విడవలూరు మండలాల మధ్య ప్రస్తుతం గంటల్లో వున్న ప్రయాణ దూరం నిమిషాలకు చేరుతుందన్నారు. బ్యారేజ్ వద్ద నిల్వ వున్న నీళ్లు భూమి లోనికి ఇంకడం ద్వారా తీరప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ఉప్పునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇందుకూరు పేట మండల వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని గత ప్రభుత్వం కోవూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో విలీనం చేయాలనీ నిర్ణయం తీసుకుంటే తాను ప్రత్యేక చొరవ తీసుకొని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవిని ఒప్పించి ఇందుకూరు పేటలో వున్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని యధాస్థితిగా కొనసాగించేలా చేశానన్నారు. ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఇందుకూరుపేట తహసీల్దారు గోపికృష్ణ, ఎంపిడిఓ నాగేంద్ర, మండల టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి. పి ఎల్ రావు నరసింహులు గార్లతో పాటు టూరిజం, ఆర్ అండ్ బి అధికారులు పంచాయతీరాజ్ అధికారులు టిడిపి కార్యకర్తలు మరియు మైపాడు గ్రామ కాపులు పాల్గొన్నారు.



