

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలసి, రధం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, ప్రధానోపాధ్యాయులు DSKV ప్రసాద్ , మానవతా సింగరాయకొండ మండల శాఖ చైర్మన్ శ్రీమతి గుంటక రామలక్ష్మమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత్వానికి మించిన ఆస్తి లేదని ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించాలని అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే నినాదంతో, విద్యార్థులందరు రథం సెంటర్ లో మానవ హారంగా ఏర్పడ్డారు. ప్రపంచ శాంతి కోసం విద్యార్థిని విద్యార్థులతో మరియు గ్రామ పెద్దలతో, శింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి , ప్రపంచ మానవాళి శాంతి గా జీవించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో మానవత కమిటీ సభ్యులు MV రత్నం , పాకల కోటేశ్వరరావు , కోటపాటి నారాయణ , సెక్రెటరీ జేడీ వెంకట సుబ్బారావు గారు మహంకాళి నరసింహారావు గారు,రమణారెడ్డి, మల్లికార్జున పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.