

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలో గోర్గల్ గేటు వద్ద సొసైటీ ఫంక్షన్ హాల్ లోని గ్రోమోర్ సురక్ష (
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులకు ప్రస్తుత వరి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు గురించి నిపుణులు సవివరంగా తెలియజేశారు.
హైదరాబాద్ జోన్ అధికారి ప్రపుల్లా మాట్లాడుతూ – పంటలో సరైన సమయంలో మందుల వాడకం, పురుగుమందుల మోతాదులు,పద్ధతుల గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కామారెడ్డి టి.ఎం సుమ గాంధే రైతులకు – గ్రోమోర్ సురక్ష ఉత్పత్తులు పంటలో రోగాలను తగ్గించడమే కాకుండా దిగుబడిని పెంచే విధంగాఉపయోగపడతాయని వివరించారు.
యెల్లారెడ్డి పి.టి.జీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ – పంటను ఎటువంటి దశలో ఏ రసాయనాన్ని వాడాలో, కలుపు నివారణకు సమర్థవంతమైన పద్ధతులు ఏవో రైతులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాగి,గొర్గల్, వడ్డేపల్లి,నిజాంసాగర్, అచ్చంపేట గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రైతులు ప్రతినిధులను ప్రశ్నలు అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు.రైతులు గ్రోమోర్ సురక్ష ఉత్పత్తులు వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
