

ఉరవకొండ, మన న్యూస్:
అనంత జిల్లా ఉరవకొండ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పెన్నోబిలంలో గురువారం సాయంత్రం చిత్రీకరణలో పాల్గొన్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రతో గుర్తింపు పొందిన నటుడు కేశవ (జగదీశ్)ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరి ప్రసాద్ యాదవ్ ఘనంగా సత్కరించారు.యువ దర్శకుడు అభి దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న చిత్రంలో హీరోగా నటిస్తున్న కేశవను కలసి శాలువాతో సత్కరించిన డాక్టర్ హరి ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ –
“వెనకబడిన కరువు జిల్లా అయిన అనంతపురంలోని పవిత్ర పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన పెన్నోబిలంలో మంచి సందేశాత్మక కథలతో సినిమాలు రూపొందించడం హర్షణీయమైన విషయం. భవిష్యత్తులో మరింత మంది దర్శకులు ఇలాంటి ప్రదేశాలను తమ చిత్రాలకు వేదికగా ఉపయోగిస్తే ఈ ప్రాంతం విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది” అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజశేఖర్ నీలకంఠ, హరీష్, లక్ష్మీ ప్రసాద్, మస్తాన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
