

మన న్యూస్ సింగరాయకొండ:-
శానంపూడి గ్రామానికి చెందిన గద్దె కోటయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా షష్టిపూర్తి చేసుకున్న నేపథ్యంలో తన సతీమణి సంధ్యారాణి మరియు కుటుంబ సభ్యుల సమేతంగా శానంపూడి గ్రామంలో రెండు పాఠశాలకు,ద్వారకా నగర్ లోని ప్రభుత్వ పాఠశాల మరియు హెచ్ పి.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పదివేల రూపాయలు విలువ చేసే విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గద్దె కోట మాట్లాడుతూ పిల్లల విద్యా వృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి అందజేశామన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నిరాటంకంగా తమ చదువులను కొనసాగించేలా ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశ్యంగా,ప్రతి విద్యార్థికి అవసరమైన ప్రాథమిక విద్యా వనరులు అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.అదేవిధంగా చిన్నచిన్న సహకారాలు కూడా పిల్లల భవిష్యత్ విద్యా అభివృద్ధికి దోహదం చేస్తాయని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి పథకాలతో పాటుగా, స్థానిక పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కార్యక్రమ నిర్వాహకులు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలియజేయగ పాఠశాల సిబ్బంది గద్దె కోటయ్య దంపతులను శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనూష మరియు షేక్ రేష్మ లు, చిమ్మిరి చెంచురామయ్య, బ్రహ్మయ్య,కోడిపల్లి రాంబాబు, నర్రా శ్రీనివాసులు,వీరస్వామి, ఏడుకొండలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
