

మన న్యూస్: కామారెడ్డి జిల్లా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల అయ్యప్ప ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో అంతమంది వ్యక్తులు హిందువులపై మత మౌడ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచి వేయాలన్నారు. అమాయక హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ఈనెల 4 తేదీన బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ కామారెడ్డిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ర్యాలీకి ప్రతి ఒక్క హిందూ బంధువులు పాల్గొని విజయంతో చేయాలని కోరారు.