

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏసీబీ వలలో ఏలేశ్వరం కమిషనర్
కమీషన్ల కోసం కాంట్రాక్టర్ ని వేధిస్తున్న కమిషనర్ పై రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ తొండారపు రాజబాబు మున్సిపల్ కి సంబంధించిన కాంట్రాక్టు పనులు నిర్వహిస్తాడు.తను చేసిన పనుల నిమిత్తం రావాల్సిన సొమ్ము కోసం కమిషనర్ ని అడుగగా లంచం కోసం వేధిస్తుండడంతో రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కిషోర్ బాబు తమ సిబ్బందితో వలపన్నారు.ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం కంప్యూటర్ డేటా ఆపరేటర్ గుసిడి అరుణాచలం అనే వ్యక్తి 23 వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఏసిబి డిఎస్పి కిషోర్ బాబు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి 2017 సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన బిల్లుకు సంబంధించిన 6 లక్షలు విడుదల చేయగా ఇంకా 7.25 లక్షలు రావాల్సి ఉంది. అలాగే 2015లో సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణానికి సంబంధించి ఒక లక్ష రూపాయలు రావాల్సి ఉంది.ఈ రెండు పనుల నిమిత్తం సొమ్ము విడుదల చేసేందుకు నగర కమిషనర్ ఎం సత్యనారాయణ మూడు శాతం చొప్పున 23 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు పేర్కొన్నార న్నారు. తమ సిబ్బందితో వలపన్ని అవినీతికి కమిషనర్ ఎం సత్యనారాయణ ను, ఆయనకు సహకరించిన అరుణాచలమును అదుపులో తీసుకొని జ్యూడిషియల్ కస్టడీకి పంపుతామన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగిన అవినీతికి పాల్పడిన తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా డిఎస్పి కిషోర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సబ్ ఇన్స్పెక్టర్లు వై సతీష్, ఎంవి భాస్కరరావు సిబ్బంది తదితరులు ఉన్నారు.