

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జాతీయ వర్క్ షాప్ ను స్థానిక లారీ వొనెర్స్ అస్సోసియేసన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ డి.సునీత విలేకరుల సమావేశమలో తెలిపారు.ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్ పధకంలో భాగంగా ఎంట్రీవిష్టా అనే అంశం పై జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని,ఈ వర్క్ గానీ ఉద్యోగాలు అడిగే స్థితిలో ఉండకూడదని ప్రతి ఒక్కరు వ్యవస్థాపకులుగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో వివిద ప్రాంతాల నుండి రిసోర్స్ పర్సన్స్ కొత్త కొత్త స్టార్ట్ అప్స్ గూర్చి విద్యార్డులకు తెలియజేస్తారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమాని ఆర్గనైజింగ్ కన్వీనర్గా డా.ప్రయాగ మూర్తి ప్రగడ, కె.సురేశ్,ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా కె. వేంకటేశ్వర రావు,కె.రామరావు వ్యవహరిస్తారని తెలియజేశారు.