

మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జి నందు 60 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. శరవేగంగా సాగుతున్న రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ నందు సి.సి.రోడ్డు పనులు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నేటి నుండి కాంక్రీట్ పనులు ప్రారంభం, చెప్పిన సమయానికి నాణ్యతా ప్రమాణాలతో సి.సి. రోడ్డు నిర్మించే విధంగా, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనులను అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులపై సమీక్షిస్తున్నారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టిడిపి నాయకులు గోపాలయ్య, లీలా మోహన్ రెడ్డి, కోరెం వెంకటేశ్వర్లు, కోరెం ప్రవీణ్, శీనయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.

