

మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20*
పూతలపట్టు నియోజకవర్గంలో పెన్షన్ తొలగింపుపై పూతలపట్టు నియోజకవర్గం అధికారులతో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు శాసనసభ్యులు కార్యాలయంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పీడీ మరియు నియోజకవర్గ ఎంపీడివోలతో సమావేశమై పెన్షన్ల తొలగింపు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పెన్షన్ తొలగిన వారి జాబితా అర్హత లేకున్నా పెన్షన్ పొందుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల హక్కుల విషయంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. పూతలపట్టు నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తాను” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
