

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం పట్టణం లో పైల సుభాష్ చంద్ర బోస్ ఆదేశాల మేరకు, ఏలేశ్వరం మండల బీజేపీ అధ్యక్షులు పైలా అయ్యప్ప ఆధ్వర్యంలో,స్థానిక లచ్చారావు కాలనీ లో నివసిస్తున్న సంచార జాతులు బేడా, బుడుగ, జంగాల కులస్తులు అందరితోటి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చా శివ ప్రసాద్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాధపల్లి శ్రీనివాస రాజు, ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు. ఈ నెల 30 వ తేదిన విజయవాడ లో జరుగు సంచార,అర్థ సంచార,విముక్తి జాతుల మహాసభ కు ఇక్కడ వున్న సంచార జాతుల ప్రజలు అందరు రావాలి అని మరియు రాష్ట్ర బీజేపీ పార్టీ మీ కోసం పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించడం జరుగుతుంది అని కావున సంచార జాతుల ప్రజలు అందరికి రాష్ట్ర బీజేపీ విడుదల చేసిన కరపత్రం పంపిణీ చేశారు. ఈ సమావేశంనకు స్థానిక బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.