

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :- నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత,టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు శివ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు, అభిమానుల కోలాహాలం నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు,అభిమానులు,పలువురు టిడిపి శ్రేణులు భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని,స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వెన్నా శివ టిడిపి వెంటే నడుస్తున్నారని,దివంగత టిడిపి నేతలు పర్వత చిట్టిబాబు, వరుపుల రాజాకు వీర విధేయుడుగా పేరు సంపాదించుకుని, అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలకి,తన నమ్ముకున్న వారికి అండగా నిలిచిన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సత్యప్రభ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు.అభిమానులు పలు చోట్ల భారీ గజమాలలు వేసి భారీ కేక్ కట్ చేయించి తమ అభిమాన నాయకుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నా జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకుడు,రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొమ్మిడి సత్తిబాబు రాజాల చిట్టిబాబు,వీర్ల సూరిబాబు, పలివెల సతీష్,,వీరబాబు,కొయ్యా రమణ,సాధనాల లక్ష్మీబాబు,చక్రి,రాజు,అధిక సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.