

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ఈశ్వరునికి, ఆంజనేయస్వామికి పార్టీ నాయకులు గాది శ్రీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాది శ్రీను మాట్లాడుతూ ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందించాలని నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోమానం శివ, గాది దొరబాబు, తోట సత్తిబాబు, యండమూరి నాగు, గాది నాగన్న దొర, గాది రాజబాబు తదితరులు పాల్గొన్నారు.