

* భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ* వచ్చే సోమవారం కల్లా భవనాన్ని అందుబాటులో తెస్తామని సిఆర్డిఏ అధికారులు వెల్లడి.మన న్యూస్ ,అమరావతి/నెల్లూరు ఆగస్టు 18:అమరావతిలోని అసెంబ్లీ ఆవరణంలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు.భవన నిర్మాణం మొత్తం 1224 చ.మీటర్ల విస్తీర్ణంలో G+1 ఉండే విధంగా చర్యలు చేపట్టారు.. అందులో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్ చేసి డైనింగ్ రూమ్, కిచెన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదటి అంతస్తులో 16 చాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూం ఏర్పాటు చేశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రికి సీఆర్డీఏ అధికారులు తెలియజేసారు. మంత్రి నారాయణ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


