

కలిగిరి/మన న్యూస్ ప్రతినిధి:///
కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంగిలే కల్లయ్య ఆకస్మిక మృతి పట్ల టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ప్రగాఢ సంతాపం తెలిపారు.కల్లయ్య పార్టీ పట్ల చూపిన అంకితభావం, క్రమశిక్షణ, వినయశీలత ఎల్లప్పుడూ కార్యకర్తలకు ఆదర్శమని బొల్లినేని గుర్తుచేశారు. “కల్లయ్య గారు పార్టీ కోసం ఎప్పటికప్పుడు కష్టపడుతూ, కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ముందుండేవారు. అటువంటి సౌమ్య స్వభావం కలిగిన నాయకుడి ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇది మా పార్టీకి మాత్రమే కాదు, కలిగిరి ప్రజలకు కూడా భర్తీ కాని లోటు” అని పేర్కొన్నారు.ఈ కష్టసమయంలో కల్లయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, దేవుడు వారికి ధైర్యం ప్రసాదించాలని, కల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని బొల్లినేని వెంకట రామారావు అన్నారు.