ఐదు గేట్లును పైకెత్తి దిగువకు నీటి విడుదల

మన న్యూస్,నిజాంసాగర్,( సంగారెడ్డి )సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నెల 13వ తేదీన ప్రాజెక్టు 11వ నంబర్‌ గేట్‌ను 1.50 మీటర్ల పైకెత్తి దిగువకు నీటిని వదలడం ప్రారంభించగా, ఈ నెల 15వ తేదీన 8,9 నంబర్ల గేట్లను పైకెత్తి ఈ మూడు గేట్ల ద్వారా 25433 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయితే ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరుగుతుండడంతో శనివారం మూడు గంటల వ్యవధిలోనే 6, 10 వ నంబర్‌ల గెట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తంగా 6,8,10,11,9, నంబర్ల గేట్లను 1.50 మీటర్లు,పైకెత్తి గేట్ల ద్వారా 43634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 2180 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 60 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 70 క్యూసెక్కులు, హైదరాబాద్‌ వాటర్‌ బోర్డుకు 80 క్యూసెక్కులు, తాలెల్మ లిఫ్ట్‌కు 33 క్యూసెక్కులు, అవిరి రూపంలో 390 క్యూసెక్కులు, మొత్తంగా ప్రాజెక్టు నుంచి 43634 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు నుంచి దిగువకు రెండు టీఎంసీలు
ఈ వర్షాకాల సీజన్‌ ఆరంభం నుంచి సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు 2 టీఎంసీల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఈ నెల 13వ తేదీన ఒక గేట్‌ను ఓపెన్‌ చేసి దిగువకు నీటిని వదలగా, ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తుండడంతో ఐదు గేట్లను పైకెత్తి నీటిని వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగితే మాత్రం మరిన్ని గేట్లను పైకెత్తి నీటిని వదిలే అవకాశం ఉందని అంటున్నారు.”

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///